ఎన్నికల బాండ్లు, నోట్ల రద్దు పేరుతో దేశంలో భారీ దోపిడీ

ఎన్నికల బాండ్లు, పెద్దనోట్ల రద్దు పేరుతో దేశంలో భారీ దోపిడీ జరిగిందని సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ)అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ శుక్రవారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు.

Updated : 13 Apr 2024 06:15 IST

అఖిలేశ్‌ యాదవ్‌

పీలీభీత్‌: ఎన్నికల బాండ్లు, పెద్దనోట్ల రద్దు పేరుతో దేశంలో భారీ దోపిడీ జరిగిందని సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ)అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ శుక్రవారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇక్కడి ప్రజలు భాజపాను ఓడించాలని నిర్ణయించుకున్నారని, దీంతో కమలం పార్టీకి భయం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో ఇండియా కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఎన్నికల బాండ్లను భాజపా సాధనంగా చేసుకుందని..ఈడీ, సీబీఐలను చూపి బడా వ్యాపారవేత్తలను భయపెట్టి బాండ్ల రూపంలో డబ్బులు దండుకుందని ఆరోపించారు. దోపిడీ చేసిన సొమ్మువల్లే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. అన్నదాతల బలాన్ని గుర్తించిన తర్వాతే కేంద్రంలోని భాజపా మూడు ‘నల్ల’ రైతు చట్టాలను వెనక్కు తీసుకుందని పేర్కొన్నారు. కాషాయ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పోలీసు సేవల కాలపరిమితి మూడేళ్లకు తగ్గిస్తుందని ఆయన హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని