కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి ప్రచారం అడ్డగింతకు కుట్ర

పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడులో శుక్రవారం సాయంత్రం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Published : 13 Apr 2024 06:41 IST

ట్రాక్టరు అడ్డుపెట్టి.. ఆపై తెదేపా కార్యకర్తలపైకి నడిపేందుకు యత్నం
పల్నాడు జిల్లాలో అరాచకం

కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడులో శుక్రవారం సాయంత్రం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మారెడ్డి తన అనుచరులతో ప్రచారరథంపై వైకుంఠపురం నుంచి వస్తుండగా నరమాలపాడు ప్రాథమిక పాఠశాల సమీపంలో వైకాపా సానుభూతిపరులు కారసాల రమేష్‌, పైడి వెంకటేష్‌ అనే వ్యక్తులు ట్రాక్టర్‌ను అడ్డుపెట్టారు. గ్రామస్థులు వారిస్తున్నా ట్రాక్టరును తెదేపా కార్యకర్తలపైకి నడిపే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన తెదేపా కార్యకర్తలు వారిని ప్రశ్నిస్తుండగా స్థానికులు వచ్చి ట్రాక్టరును పక్కకు పెట్టించారు. విషయం తెలుసుకున్న సీఐ  చినమల్లయ్య, ఎస్సై రామాంజనేయులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాక్టరు అడ్డుపెట్టినవారిని   గ్రామ సరిహద్దు వరకు తీసుకొచ్చి మంతనాలు జరుపుతుండగా.. మరికొందరు వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో బ్రహ్మారెడ్డి ప్రచారరథం మరో వీధిలోకి వెళ్లింది. ఆ వీధిలో గొడ్డళ్లు, రాడ్లు తెదేపా కార్యకర్తల కంటపడటంతో భయాందోళనకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని