స్టాలిన్‌కు రాహుల్‌ తీపికానుక

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీపికానుక ఇచ్చారు. ఈ నేతలిద్దరూ శుక్రవారం రాత్రి కోయంబత్తూరు నగర ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న విషయం తెలిసిందే.

Published : 14 Apr 2024 04:28 IST

కోయంబత్తూర్‌, న్యూస్‌టుడే: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీపికానుక ఇచ్చారు. ఈ నేతలిద్దరూ శుక్రవారం రాత్రి కోయంబత్తూరు నగర ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న విషయం తెలిసిందే. సభలో పాల్గొనడానికి ముందు నగరంలోని సింగానల్లూర్‌ వద్ద రాహుల్‌ ఆకస్మికంగా ఓ మిఠాయి దుకాణానికి వెళ్లారు. అక్కడి మిఠాయిలతో గిఫ్ట్‌ప్యాక్‌ తీసుకొని బహిరంగసభ వేదికపై స్టాలిన్‌కు దాన్ని అందించారు. ఈ వీడియోను కాంగ్రెస్‌  తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంది. అందులో.. కాంగ్రెస్‌ అగ్రనేత రోడ్డు మధ్యలోని డివైడరును దాటి దుకాణానికి వెళ్లడం కనిపించింది. రాహుల్‌ను చూసి షాపు సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘‘ఏం కావాలి సార్‌’’.. అని అడగ్గా.. ‘‘బ్రదర్‌ స్టాలిన్‌ కోసం మైసూర్‌పాక్‌ కొనాలి’’ అని రాహుల్‌ చెప్పడం వీడియోలో ఉంది. అనంతరం సభా వేదికపై స్టాలిన్‌కు మిఠాయిలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని