కాంగ్రెస్‌ హయాంలో వడ్ల కుంభకోణం: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

రాష్ట్రంలో రూ.1,450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 14 Apr 2024 05:35 IST

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రూ.1,450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గోదాముల్లో నిలువ ఉన్న ధాన్యానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు పిలిచి టన్ను రూ.1,600 చొప్పున విక్రయించింది. ఈ వ్యవహారంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేస్తాం. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ ఎవరి చేతుల్లోకి వెళ్తోందో ఆధారాలున్నాయి. భారాస హయాంలో వడ్లను ఎగుమతి చేస్తే.. రేవంత్‌రెడ్డి హయాంలో అవినీతి కరెన్సీని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తున్నారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన రంజిత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని టికెట్‌ ఇచ్చారు’’ అని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని