14-15 సీట్లలో కాంగ్రెస్‌ గెలుస్తుంది

పదేళ్ల పాలనలో తెలంగాణను మోసం చేసిన భారాస, భాజపాలకు లోక్‌సభ ఎన్నికల్లో శిక్ష తప్పదని పౌరసరఫరాల, నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Updated : 14 Apr 2024 05:28 IST

ఎన్నికల్లో భారాస, భాజపాలకు శిక్ష తప్పదు: మంత్రి ఉత్తమ్‌

దేవరకొండ, న్యూస్‌టుడే: పదేళ్ల పాలనలో తెలంగాణను మోసం చేసిన భారాస, భాజపాలకు లోక్‌సభ ఎన్నికల్లో శిక్ష తప్పదని పౌరసరఫరాల, నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. గత భారాస ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసిందని ఆరోపించారు. శనివారం నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్వహించిన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14-15 స్థానాలు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ సీటును కాంగ్రెస్‌ నిలబెట్టుకుంటుందని చెప్పారు. భారాస, భాజపాలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని ఎస్సెల్బీసీ, డిండి ఎత్తిపోతల, కంబాలపల్లి, పొగిళ్ల, అక్కంపల్లి, నంబాపూర్‌, అంబభవానితోపాటు కొత్తగా మరో రెండు చిత్రియాల, గాజుబేగం లిఫ్ట్‌లను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కె.రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్‌ బాలునాయక్‌, కుందూరు జైవీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, లింగారెడ్డి, పురపాలిక ఛైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని