ఓటములకు వెరవని అభ్యర్థి

హస్నూరాం అంబేడ్కరీ (78).. పట్టు వదలని విక్రమార్కుడు. ఇప్పటిదాకా 98సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు.

Published : 14 Apr 2024 05:26 IST

ఆగ్రా: హస్నూరాం అంబేడ్కరీ (78).. పట్టు వదలని విక్రమార్కుడు. ఇప్పటిదాకా 98సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 1985లో తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ బరిలో దిగారు. ఒక్కసారీ గెలవకపోయినా పోటీకి సై అంటూనే ఉన్నారు. ఈసారీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ తాను ఓడిపోతానని తెలుసనీ, మొత్తం 100 సార్లు పోటీ చేసిన తరువాతే విరమించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి కూలీగా పని చేసే ఆయన 1985లో బీఎస్పీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశారు. అప్పట్లో ఖేరాగఢ్‌ నియోజకవర్గంలో బీఎస్పీ టిక్కెట్‌ను తనకిస్తానని వాగ్దానం చేశారని, కానీ తరువాత ఇవ్వలేదని ధర్తీ పకడ్‌ చెప్పారు. దాంతో ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశానన్నారు. ఈసారి ఆగ్రా రిజర్వుడు లోక్‌ సభ సీటుకూ, ఫతేపూర్‌ సిక్రీ సీటుకూ నామినేషన్‌ వేస్తానని ప్రకటించారు. తాను పంచాయతీ సర్పంచి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులకు పోటీ చేశాననీ, రాష్ట్రపతి పదవికీ నామినేషన్‌ వేసినా తిరస్కరించారని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని