వైకాపా ప్రభుత్వంలో హంతకులకు భయమే లేదు

‘సార్‌.. వైకాపా ప్రభుత్వంలో హంతకులకు భయమే లేదు. నిందితులకు కొమ్ము కాసేలా ప్రభుత్వ తీరు ఉంది.

Published : 14 Apr 2024 05:21 IST

చంద్రబాబును కలిసిన ఉప్పాల అమరనాథ్‌ గౌడ్‌ సోదరి
తన తమ్ముడి హత్య కేసులో న్యాయం జరగలేదని ఆవేదన

ఈనాడు, బాపట్ల: ‘సార్‌.. వైకాపా ప్రభుత్వంలో హంతకులకు భయమే లేదు. నిందితులకు కొమ్ము కాసేలా ప్రభుత్వ తీరు ఉంది. నా తమ్ముడు ఉప్పాల అమరనాథ్‌ గౌడ్‌ను పెట్రోలు పోసి హత్యచేసిన వైకాపా కార్యకర్త వెంకటేశ్వరరెడ్డికి శిక్ష విధించడంలో పోలీసులు విఫలమయ్యారు’ అని అమరనాథ్‌ గౌడ్‌ సోదరి హేమశ్రీ... తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఆవేదన చెందారు. తప్పు చేసినవారికి శిక్షలు పడాలన్నా.. శాంతిభద్రతలు మెరుగ్గా ఉండాలన్నా తెదేపా ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు. రేపల్లె వచ్చిన చంద్రబాబును కలిసి తన గోడు వెళ్లబోశారు. ‘తండ్రి లేని కుటుంబానికి అండగా నిలవాల్సిన తమ్ముడ్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మీరు అండగా నిలిచారు. మీ ప్రోత్సాహంతోనే నేను ఇంటర్‌ పాసై ఎంసెట్‌ రాస్తున్నా’ అని తెలిపారు.

బెదిరింపులకు పాల్పడుతున్నారు: ‘మా తమ్ముడి హత్య కేసులో నిందితులంతా బయటే ఉన్నారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్వరరెడ్డి బయటకు వచ్చాక బెదిరింపులకు పాల్పడ్డారు. పండగలు, శుభకార్యాలు అని చెప్పి నిందితుడు తరచూ ఊళ్లోకి వస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది’ అని హేమశ్రీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మీకు తెదేపా అండగా ఉంటుంది. ఏం భయపడొద్దు. బాగా చదువుకుని నీ లక్ష్యమైన పోలీసు కొలువు సాకారం చేసుకో. కొలువు సాధించాక నేరస్థులు, సంఘ విద్రోహశక్తుల గుండెల్లో నిద్రపో’ అంటూ చంద్రబాబు ఉత్సాహపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని