ఫైబర్‌నెట్‌ సేవల నిలిపివేతపై త్వరలో కేంద్ర ప్రభుత్వం విచారణ

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభను విజయవంతం కానీయకుండా వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫైబర్‌నెట్‌ సేవలకు అవరోధం కలిగించిందని భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం ఆరోపించారు.

Published : 14 Apr 2024 05:23 IST

భాజపా నేత పాతూరి నాగభూషణం వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభను విజయవంతం కానీయకుండా వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఫైబర్‌నెట్‌ సేవలకు అవరోధం కలిగించిందని భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం ఆరోపించారు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘బహిరంగ సభ జరిగిన రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఫైబర్‌నెట్‌ సేవలకు అంతరాయం కలిగింది. సర్వర్‌ సమస్యలు సృష్టించారు. దీనిపై కేంద్రం త్వరలో విచారణ జరపనుంది. సామాజిక మాధ్యమాల ద్వారా వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్టు వైకాపా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేసింది. ఇంటెలిజెన్స్‌ బ్యూరో సర్వే ఫలితాలంటూ వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. పలు పత్రికలు, ఛానెల్స్‌ లోగోలను అక్రమంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే వీటిపై ఎన్నికల కమిషన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని