జగన్‌ పాలనలో ఆయన తల్లికి, చెల్లికే రక్షణ లేదు

జగన్‌ పాలనలో ఆయన తల్లి, చెల్లికే రక్షణ లేనప్పుడు... ఇక సామాన్య మహిళలకు ఎలా ఉంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Published : 14 Apr 2024 05:24 IST

సామాన్య మహిళలకు ఉంటుందా?
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో ఆయన తల్లి, చెల్లికే రక్షణ లేనప్పుడు... ఇక సామాన్య మహిళలకు ఎలా ఉంటుందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. గాజువాక 65వ వార్డు బానోజి తోటలో నివాసం ఉంటున్న రాధ అనే మహిళను.. ఆ వార్డు వైకాపా అధ్యక్షుడు లోకనాథం మంటల్లోకి నెట్టడం దారుణమని ఎక్స్‌ వేదికగా శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంటి పట్టాకు లంచం ఎందుకు ఇవ్వాలని నిలదీసిన రాధను లోకనాథం సజీవదహనం చేయాలనుకోవడం.. వైకాపా అరాచకాలకు అద్దంపడుతోంది. నిందితుణ్ని ఆయనకు సహకరించిన వైకాపా నేతల్ని వెంటనే అరెస్టు చేయాలి. బాధితురాలికి మెరుగైన వైద్య చికిత్స అందించాలి’’ అని నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

ఇసుక, మద్యం మాఫియా రోజుకొకర్ని బలి తీసుకుంటోంది

రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా రోజుకొకర్ని బలి తీసుకుంటోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్లలోని ఇసుకతిన్నెల్లో గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించడంపై ఎక్స్‌ వేదికగా శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణానికి ఇసుక మాఫియానే కారణమై ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చారు.

దిగజారుడు రాజకీయాల్లో జగన్‌ను కొట్టేవారు లేరు

దిగజారుడు రాజకీయాల్లో జగన్‌ను కొట్టేవారు లేరని నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. జగన్‌ బస్సు యాత్ర వద్దకు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్ట్రెచర్‌ మీద తీసుకురావడంపై లోకేశ్‌ స్పందించారు. ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్‌ అని హితవుపలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని