క్రైస్తవులను మోసగించిన జగన్‌ ప్రభుత్వం

‘క్రైస్తవులకి, పాస్టర్లకు జగన్‌ సర్కారు తీరని అన్యాయం చేసింది. మాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో మేము తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతు ఇస్తాం’ అని ఆలిండియా ఇండిపెండెంట్‌ పాస్టర్స్‌ కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు.

Published : 14 Apr 2024 05:25 IST

వచ్చే ఎన్నికల్లో కూటమికే మా మద్దతు
చంద్రబాబుతో ఆలిండియా ఇండిపెండెంట్‌ పాస్టర్స్‌ కౌన్సిల్‌ సభ్యులు

ఈనాడు, బాపట్ల: ‘క్రైస్తవులకి, పాస్టర్లకు జగన్‌ సర్కారు తీరని అన్యాయం చేసింది. మాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో మేము తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతు ఇస్తాం’ అని ఆలిండియా ఇండిపెండెంట్‌ పాస్టర్స్‌ కౌన్సిల్‌ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బాపట్ల జిల్లా రేపల్లెలో ఉన్న చంద్రబాబును పలు జిల్లాలకు చెందిన పాస్టర్ల ప్రతినిధులు, బిషప్‌లు శనివారం కలిసి మద్దతు ప్రకటించారు. ‘వైకాపా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను విస్మరించింది. సేవకులకు రూ.5 వేల వేతనమిస్తామని చెప్పి మొండిచేయి చూపింది. చివరకు కేంద్రం నుంచి వచ్చే సాయానికీ మోకాలొడ్డింది. క్రైస్తవ భవన నిర్మాణాలకు నిధులిస్తామని చెప్పి పట్టించుకోలేదు. కొందరు వైకాపా నాయకులు ఆ స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. పోలీసులతో వారికే మద్దతు పలికించి ఇబ్బంది పెట్టారు. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబుకు వివరించారు. అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. తెదేపా క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు స్వామిదాస్‌, బిషప్‌ అడపా నాగమోహనరావు తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని