‘ట్యాపింగ్‌’ ప్రతిఫలం అనుభవించాల్సిందే: మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలమంది ఫోన్లను ట్యాప్‌ చేసిన అంశంలో భాగమైన వారంతా జైలుకెళ్లాల్సిందేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Updated : 15 Apr 2024 07:36 IST

వైరా, న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలమంది ఫోన్లను ట్యాప్‌ చేసిన అంశంలో భాగమైన వారంతా జైలుకెళ్లాల్సిందేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, తనతో సహా వేలాది ఫోన్లు ట్యాప్‌ చేసిన కేసులో పూర్తి ఆధారాలను త్వరలోనే ప్రజలు ముందుకు తీసుకొస్తామన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తెలిపారు. విద్యుత్తు, కాళేశ్వరంలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని హైదరాబాద్‌ చుట్టూ, జిల్లా కేంద్రాల్లో విలువైన భూములను ఆక్రమించుకున్న వ్యవహారంలోనూ నాటి మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి సహా అందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. భారాస ముఖ్యులు అవినీతికి పాల్పడ్డారని, నాటి తప్పుల ప్రతిఫలాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్‌కే దక్కుతాయని ఖమ్మంలో భారీ ఆధిక్యం సాధిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ మాజీ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, పురపాలక ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని