తెదేపా ప్రచార రథంపై వైకాపా కార్యకర్తల దాడి

తెదేపా ప్రచార రథంపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో డ్రైవర్‌కు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయునిచెరువు పంచాయతీ అగ్రహారంలో చోటుచేసుకుంది.

Published : 15 Apr 2024 05:20 IST

వాహన డ్రైవర్‌కు గాయాలు

రాయచోటి, రామాపురం, న్యూస్‌టుడే: తెదేపా ప్రచార రథంపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో డ్రైవర్‌కు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయునిచెరువు పంచాయతీ అగ్రహారంలో చోటుచేసుకుంది. రాయచోటి అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం ఇదే మండలంలోని గోపగుడిపల్లి, కసిరెడ్డిగారిపల్లిలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రచార రథం అగ్రహారంలోకి వెళ్లగానే వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వాహనం ధ్వంసం కాగా డ్రైవర్‌ శివశంకర్‌కు గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన తెదేపా కార్యకర్త దిలీప్‌కుమార్‌ యాదవ్‌ను కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లక్కిరెడ్డిపల్లి సీఐ గంగానాథబాబు, ఎస్సై ప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకుని అతన్ని రక్షించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్‌ను తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరామర్శించారు. వైకాపా అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అనుచరులు తెదేపా నాయకులపై బెదిరింపులకు దిగుతూ, దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని