ఆర్థికాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా భాజపా మ్యానిఫెస్టో

మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేలా, వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో మరింత భాగస్వామ్యం చేసేలా భాజపా ‘సంకల్ప పత్రం’ (మ్యానిఫెస్టో) తీసుకొచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ తెలిపారు.

Published : 15 Apr 2024 05:49 IST

సాధినేని యామినీశర్మ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేలా, వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో మరింత భాగస్వామ్యం చేసేలా భాజపా ‘సంకల్ప పత్రం’ (మ్యానిఫెస్టో) తీసుకొచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ తెలిపారు. దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపే దిశగా మ్యానిఫెస్టో ఉందన్నారు. యువత, రైతులు, శ్రామికులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారని తెలిపారు. 2014, 2019 మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పార్టీ అమలు చేసిందని స్పష్టం చేశారు. మహిళలకు ఇప్పుడిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు మరిన్ని పథకాలు కొత్తగా జోడించిందని ఆదివారం ఓ ప్రకటనలో వివరించారు. ‘పీఎం సూర్యఘర్‌ యోజన పథకం ద్వారా నిరుపేదల ఇళ్లకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయనుంది. ‘నారీ శక్తి వందన్‌’ పేరిట 33% రిజర్వేషన్‌ను అమలు చేసి తీరుతుంది. దేశంలోని మరిన్ని పట్టణాల్లో మెట్రో రైళ్లను పరుగులు పెట్టించి, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయాణ సౌకర్యాన్ని సులభతరం చేసే దిశగా భాజపా పనిచేస్తోంది’ అని యామినీశర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని