రాజ్యాంగం మార్పు’పై వ్యాఖ్యలు.. వివాదంలో టీవీ రాముడు

రాజ్యాంగం మార్పుపై ‘రామాయణ్‌’ సీరియల్‌ నటుడు, మేరఠ్‌ భాజపా అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.

Updated : 16 Apr 2024 08:31 IST

మేరఠ్‌: రాజ్యాంగం మార్పుపై ‘రామాయణ్‌’ సీరియల్‌ నటుడు, మేరఠ్‌ భాజపా అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ అంశంపై విపక్షాల ఆరోపణల గురించి.. గోవిల్‌ను ఇటీవల మీడియా ప్రశ్నించింది. ‘‘కాలానుగుణంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు జరిగాయి. మార్పు అనేది అభివృద్ధికి సంకేతం. ఇది ప్రతికూలాంశం కాదు. నాటికీ, నేటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏకాభిప్రాయంతో రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు’’ అని ఆయన బదులిచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు