గాజు గ్లాసు గుర్తు జనసేనదే

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.

Published : 17 Apr 2024 04:58 IST

ఎన్నికల చిహ్నం కేటాయింపుపై వ్యాజ్యాన్ని కొట్టేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. పార్టీ గుర్తు కేటాయింపు కోసం జనసేన పార్టీ ముందుగా దరఖాస్తు చేసుకుందని,  నిబంధనలకు అనుగుణంగా, మొదట వచ్చిన వారికి మొదట విధానంలో గాజు గ్లాసు చిహ్నాన్ని కేటాయించామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గుర్తు కేటాయింపులో నిబంధనలను పాటించలేదన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాలు చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యులర్‌)పార్టీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని