ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆదేశాలు నిలిపివేయాలి

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ముకేశ్‌కుమార్‌ మీనాకు మంగళవారం భాజపా రాష్ట్ర శాఖ వినతిపత్రం అందజేసింది.

Published : 17 Apr 2024 04:59 IST

ఈసీని కోరిన భాజపా

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ముకేశ్‌కుమార్‌ మీనాకు మంగళవారం భాజపా రాష్ట్ర శాఖ వినతిపత్రం అందజేసింది. ప్రవీణ్‌ ప్రకాశ్‌ అమానుష చర్యలతో ఉపాధ్యాయులు మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొంది. పబ్లిక్‌ సర్వెంట్‌గా కాకుండా.. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఆయన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. మే13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 23న ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేయడం ఎలక్షన్‌ కోడ్‌ను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని సచివాలయంలో ఈసీకి అందజేసిన వినతిపత్రంలో ఆ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ కె.మల్లికార్జున మూర్తి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని