రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోదీ రాక

రాష్ట్రంలో నిర్వహించబోయే ఎన్డీయే ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు భాజపా జాతీయ సీనియర్‌ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు.

Published : 17 Apr 2024 05:00 IST

మూడు లేదా నాలుగు సభల్లో పాల్గొనే అవకాశం
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు వెల్లడి

 ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించబోయే ఎన్డీయే ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు భాజపా జాతీయ సీనియర్‌ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ మూడు లేదా నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. హోంశాఖ మంత్రి అమిత్‌షా నాలుగైదు సభల్లో పాల్గొంటారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం ప్రచార సభలకు హాజరవుతారు. రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, సీఎం రమేష్‌, ఇతర అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలుచేసే కార్యక్రమాల్లోనూ పార్టీ అగ్రనేతలు పాల్గొంటారు. అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్‌ నామినేషన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరవుతున్నట్లు పార్టీ అధిష్ఠానం నుంచి సమాచారం వచ్చింది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని