మంత్రి పెద్దిరెడ్డిది అవినీతి సామ్రాజ్యం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ల్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Published : 17 Apr 2024 05:54 IST

పీలేరు సభలో మండిపడ్డ షర్మిల

ఈనాడు, కడప: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ల్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్యేలను రబ్బరు స్టాంపల్లా మార్చేసి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయని, రాష్ట్ర ఖజానాను కొల్లకొడుతున్నారని ఆరోపించారు. పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు.  వైఎస్‌ఆర్‌ హయాంలో హంద్రీ- నీవా ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేయగా, జగన్‌ అధికారంలోకి రాగానే కనీసం 10 శాతం కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని, పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష, రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు మహిళల పేరిట కట్టిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని