తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలి

దళితులపై ఏమాత్రం గౌరవమున్నా శిరోముండనం కేసులో 18 నెలల శిక్ష పడిన తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలని తెదేపా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ డిమాండు చేశారు.

Published : 17 Apr 2024 05:43 IST

తెదేపా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దళితులపై ఏమాత్రం గౌరవమున్నా శిరోముండనం కేసులో 18 నెలల శిక్ష పడిన తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలని తెదేపా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ డిమాండు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘జైలు శిక్ష పడిన నిందితుణ్ని పార్టీలో కొనసాగిస్తే శిరోముండనాన్ని సీఎం జగన్‌ ప్రోత్సహించినట్లే. జగన్‌ పాలనలో దళితులపై దాడులు బిహార్‌లోకంటే దారుణంగా జరిగాయి. వైకాపా పాలనలో 185 మంది దళితులను హతమార్చారు. మాస్క్‌ అడిగిన పాపానికి దళిత డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై బట్టలు లేకుండా తిప్పారు. దళిత యువకుడిని హతమార్చి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై చర్యలు లేవు. జగన్‌ రాక్షస పాలనలో దళితులకు రక్షణ లేదు’ అని మండిపడ్డారు. నాగమ్మ హత్యను ఖండించడానికి వెళ్లిన వంగలపూడి అనిత, ఎంఎస్‌ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టారు. అంబేడ్కర్‌ విదేశీ విద్యను జగన్‌ విదేశీ విద్యగా మార్చి అంబేడ్కర్‌ను అవమానపర్చారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లను పెట్టి వాటికి రూపాయి కేటాయించలేదు. తీవ్ర అన్యాయం చేసిన జగన్‌కు ఎన్నికల్లో దళితులు బుద్ధి చెబుతారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని