అభివృద్ధి వికేంద్రీకరణ.. అమరావతిలో రాజధాని

ప్రజల ఎజెండా కోసమే సీపీఎం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.

Published : 17 Apr 2024 05:48 IST

సీపీఎం ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఈనాడు, అమరావతి: ప్రజల ఎజెండా కోసమే సీపీఎం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. సీపీఎం తరఫున కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రణాళికను మంగళవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడా సుబ్బారావు, జయరాం, హరికిశోర్‌తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైకాపా, తెదేపా, జనసేన పార్టీలకు శ్రీనివాసరావు 14 ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ పార్టీలు ప్రజల సమస్యలను ఎజెండా చేయడానికి సిద్ధంగా లేవని, ఉద్రేకాలు రెచ్చగొట్టి, రాళ్లేసుకుంటూ కాలం గడుపుతున్నాయని విమర్శించారు. ఓటర్లు ఇండి కూటమి పార్టీలను బలపరచాలని కోరారు.

ఎన్నికల ప్రణాళికలోని ముఖ్యాంశాలు

  •  అభివృద్ధి వికేంద్రీకరణ. అమరాతిలోనే రాజధాని.
  • కడప ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉపసంహరణ.
  • విద్యుత్తు ఛార్జీల పెంపు ఉండదు. ట్రూ అప్‌ ఛార్జీల రద్దు, స్మార్ట్‌ మీటర్ల రద్దు.
  • మద్యపానంపై నియంత్రణ.
  • అభివృద్ధి పేరిట గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్‌ సంస్థలకు భూములు, అటవీ ప్రాంతాన్ని కట్టబెట్టే విధానం రద్దు.
  • 40 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ.
  • జీవో 3ను పునరుద్ధరించి స్పెషల్‌ డీఎస్సీ నిర్వహణ. ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే.
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు నిర్వాసితులకు పునరావాసం, పరిహారం అందజేత.
  • నిత్యావసర సరకులు రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ.
  • గ్రామసభ తీర్మానాలతో కౌలు రైతులకు కార్డులిచ్చి, బ్యాంకు రుణాల అందజేత.
  • 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు పింఛన్లు.
  •  కనీస వేతనం రూ.26 వేలు. ఒప్పంద, పొరుగు సేవలు, ప్రాజెక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
  • నీ సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ పునరుద్ధరణకు పోరాటం.
  • నీ కనీస సంక్షేమ పింఛను రూ.6 వేలకు పెంపు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు