సీఎంపై రాయి దాడి ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి

ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Published : 17 Apr 2024 05:48 IST

సీఈవోను కోరిన జనసేన నాయకులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కేసును నిష్పక్షపాతంగా విచారించేలా ఎన్నికల సంఘం అధికారులు చొరవతీసుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాస్‌లు సీఈవోను మంగళవారం కోరారు. అనంతరం కోన తాతారావు విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై జరిగిన దాడి ప్రజల్ని నమ్మించడానికో, సానుభూతి పొందడానికో ఆడిన డ్రామాలా కనిపిస్తోంది. భద్రతా వలయం మధ్య గులకరాయి ఎక్కడ నుంచి వచ్చింది? ఘటనకు బాధ్యులైన డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణాను బదిలీ చేయాలి. సీఎం పై దాడి జరిగితే ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? అసలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగనిస్తారా అని ప్రజలు భయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలి. ఆ కమిటీ నేరుగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించేలా చర్యలు తీసుకోవాలి’ డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు