గొడ్డలిని వదిలేసి గులకరాయి వాడినందుకే కథ అడ్డం తిరిగింది

వైకాపా ట్రేడ్‌మార్క్‌ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

Published : 17 Apr 2024 05:49 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ట్రేడ్‌మార్క్‌ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అధికార దాహానికి గతంలో దళిత యువకుడు శ్రీనివాస్‌ను చేసినట్టు, ఈసారి ఓ అమాయకుడిని బలి చేయబోతున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కథ ఎవరు రచించారో గానీ అందులో పట్టులేదు. అందుకే రక్తి కట్టలేదు. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జలను తృప్తిపరచడానికి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తాపత్రయపడటం మంచిది కాదు. ఒక అమాయకుడిని బలిచేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ఒకే రాయి ఇద్దరికి తగిలినా.. కింద పడకుండా ఎటోపోవడం ఆశ్చర్యంగా ఉంది. గజమాలకు ఉన్న పుల్ల సీఎం జగన్‌కు గుచ్చుకుంది. వెంటనే ఆయన చేయి గాయమైన దగ్గరికి వెళ్లింది. అక్కడి నుంచే నాటకం ప్రారంభమైంది. కథా రచయితకు నంది, అద్భుతంగా నటించిన జగన్‌కు ఆస్కార్‌ ఇవ్వాలి. ఓడిపోతానన్న భయంతోనే జగన్‌ డ్రామాలకు ఒడికట్టారు. ఓ రాష్ట్ర సీఎంను చిన్న గులకరాయితో కొట్టి చంపాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని