‘ఆప్‌’ కా రామరాజ్య వెబ్‌సైట్‌ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ ‘ఆప్‌ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

Published : 18 Apr 2024 04:55 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ ‘ఆప్‌ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. గడిచిన పదేళ్లలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించేలా రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌, మంత్రి ఆతిశీ, సౌరభ్‌ జైన్‌ పాల్గొన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ శ్రీరాముడి సిద్ధాంతాలను సాకారం చేయడంలో భాగంగా గత 10 ఏళ్లలో ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించారు. మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత నీరు, విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైన పథకాలను అందించారు. శ్రీరామనవమి రోజున కేజ్రీవాల్‌ ప్రజల మధ్య లేకపోవడం ఇదే మొదటిసారి. కొందరి కుట్రలో భాగంగా తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లారు’’ అని సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మంత్రి ఆతిశీ ఓ శ్లోకాన్ని వినిపిస్తూ.. అన్ని కష్టాలను అనుభవిస్తూ రాముడు ఎలాగైతే తన వాగ్దానాలను నెరవేర్చారో అలాగే కేజ్రీవాల్‌ కూడా తన మాటను నిలబెట్టుకుంటారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని