‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’

ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్‌ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ మండిపడ్డారు.

Published : 18 Apr 2024 05:22 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్‌ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పలు పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, మైనార్టీ కార్పొరేషన్‌ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారని, ఉనికిలో లేని ఎన్నార్సీ చట్టాన్ని అమలు చేస్తారంటూ వైకాపా వాళ్లు అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో షరీఫ్‌ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘2014 నుంచి 2018 మార్చి వరకు భాజపాతో తెదేపా కలిసి పనిచేసింది. అప్పుడు కూడా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశాం’ అని ఫరీఫ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని