వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు

సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Published : 18 Apr 2024 05:23 IST

సీఈసీకి వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఘటనతో సంబంధం లేకపోయినా బొండా ఉమామహేశ్వరరావును ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా అక్కడ వైకాపా అభ్యర్థికి మేలు చేయాలని చూస్తున్నారన్నారు. బొండా ఉమాపై అక్రమ కేసు బనాయించకుండా సీపీని ఆదేశించాలని కోరుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)కు బుధవారం ఆయన లేఖ రాశారు. దీంతో పాటు సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా, డీజీపీ రాజేంద్రనాథరెడ్డికీ వేర్వేరుగా ఆయన లేఖలు రాశారు.

గులకరాయి దాడిలో బొండా ఉమాపై అక్రమ కేసు బనాయించేందుకు సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి చినరాజప్ప, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ ప్రకటనలో మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని