చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!

ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్‌ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు.

Updated : 18 Apr 2024 07:11 IST

ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్‌ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. ఊళ్ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నిర్మించిన ఇళ్లకూ వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ చిమ్మచీకట్లో ఉన్నవి కాకినాడ గ్రామీణ మండలంలోని నేమాం, తిమ్మాపురంలోని జగనన్న కాలనీలు. నేమాం కాలనీలో 9 వేలు, తిమ్మాపురంలో 1,968 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చాలామంది ఇళ్లు నిర్మించుకొని, ఉంటున్నారు. నేమాం కాలనీకి వెళ్లే బీచ్‌ రోడ్డు నుంచి కాలనీ వరకూ ప్రధాన మార్గంలో ఒక్క వీధి దీపం లేదు. కాలనీలో రాత్రిళ్లు అంధకారం నెలకొంటోంది. తిమ్మాపురం జగనన్న కాలనీలో ప్రధాన  వీధిలో తప్ప మిగిలిన చోట్లా అదే పరిస్థితి.

ఈనాడు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని