చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు.

Updated : 18 Apr 2024 08:50 IST

అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీ గ్లాసులను ప్రచారానికి వాడుకుంటున్నారు. కాగితపు టీ కప్పుపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల చిత్రాలు, పార్టీ గుర్తు ముద్రించి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు అనుచరులు మంగళ, బుధవారాల్లో సత్తెనపల్లిలో తొలివిడతగా సుమారు 70 టీ దుకాణాలకు 200 చొప్పున టీ కప్పులను ఉచితంగా అందజేశారు. కొందరు వాటిని తీసుకోబోమంటే.. ఒత్తిడి చేసి మరీ ఇచ్చారు. దీనిపై తెదేపా నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మొత్తానికి దుకాణాల్లో తనిఖీలు చేసి కొన్ని టీ కప్పులను స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్‌టుడే, సత్తెనపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని