గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్‌

గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్‌    సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Published : 18 Apr 2024 05:26 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్‌    సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి కేసులోనూ ఇదే తరహాలో ఓ దళితుడిని అయిదేళ్లపాటు జైలు పాలు చేశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘డబ్బులిస్తామని అమాయకుల్ని సభకు తీసుకెళ్లి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ప్రజల్లో మొదలైన తిరుగుబాటుతో వైకాపా నేతల్లో అసహనం పెరిగిపోతోంది. దాన్ని తెదేపాపై చూపిస్తే సహించేది లేదు. క్లెమోర్‌మైన్‌ పేలినా చంద్రబాబు ఏనాడూ సానుభూతి కోసం ప్రయత్నించలేదు’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని