న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్‌, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!

‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

Published : 18 Apr 2024 05:27 IST

జగన్‌ను గెలిపించేందుకు అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా సాయం
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

ఈనాడు, నెల్లూరు: ‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోకి అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియా దిగింది. ఎన్నికల్లో వైకాపాకు ఆర్థికసాయం చేసేందుకే వచ్చారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే.. రాష్ట్రంలో సులువుగా డ్రగ్స్‌ సరఫరా చేసుకోవచ్చని వైకాపాకు సాయం చేస్తున్నారు. రెడ్‌కార్నర్‌ నోటీసు ఉన్న మణి అన్నపురెడ్డి రాష్ట్రంలో యథేచ్ఛగా తిరుగుతున్నట్లే వాళ్లూ వచ్చారు. రెడ్‌కార్నర్‌ నోటీసు ఉన్నవారు దేశాలు దాటితే ఇమిగ్రేషన్‌లో అరెస్టు చేస్తారు. తెదేపాకు చెందిన యశ్‌ను అలాగే అరెస్టుచేశారు. మణిని ఎందుకు అరెస్టు చేయలేదు? ఈ నెల 6న జరిగిన సిద్ధం సభలో తిరగడంతో పాటు జగన్‌, విజయసాయిరెడ్డిలతో కలిసి ఫొటో దిగారు. కొద్ది రోజులుగా నెల్లూరులోనే తిరుగుతున్నారు. అయినా పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించకపోవడం విడ్డూరం. నేరం చేసిన వారికి ఆశ్రయం ఇచ్చిన జగన్‌, విజయసాయిరెడ్డి నేరస్థులే. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. నేరస్థుడికి ఆశ్రయమిచ్చిన విజయసాయిరెడ్డిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి’ అని ఆనం వెంకట రమణారెడ్డి డిమాండు చేశారు. దీనిపై డీజీపీతో పాటు నెల్లూరు ఎస్పీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్పందించి.. నేరస్థులను జల్లెడ పట్టి రాష్ట్రం నుంచి తరిమేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని