తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్‌ సుభానీ

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్‌ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 18 Apr 2024 05:27 IST

ముగ్గురు వైకాపా కార్పొరేటర్లు కూడా..

గుంటూరు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్‌ నసీర్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్‌ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. ఆయనతోపాటు గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్‌ షేక్‌ గౌస్‌, వైకాపా కార్పొరేటర్లు వేముల జ్యోతి, షేక్‌ మీరావలి, మొహిద్దీన్‌ చిష్ఠిబాషా, మాజీ కార్పొరేటర్‌ కుర్రా రవి, లాయర్‌ బుజ్జి, అబ్దుల్‌ కలాం, అబ్రహంతోపాటు 500 మంది తెదేపాలో చేరారు. లోకేశ్‌ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, అధికారంలోకి వచ్చాక అందరి సేవలు వినియోగించుకుంటామని వారికి చెప్పారు. ముస్లిం సోదరులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. షేక్‌ సుభానీ 2004లో కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని