‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని

సీనియర్‌ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు.

Updated : 19 Apr 2024 10:05 IST

మథుర: సీనియర్‌ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. కృష్ణుడికి బ్రిజ్‌వాసీలంటే ఇష్టమని, వారికి సక్రమంగా సేవలందిస్తేనే ఆయన ఆశీర్వదిస్తారని నమ్ముతానని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిని ఆరాధించే వారిని బ్రిజ్‌వాసీలంటారు. తాను వారికి సేవలందిస్తున్నట్లు తెలిపారు. మథురలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్రిజ్‌వాసీలకు సేవలందించేందుకు మూడోసారి అవకాశమిచ్చిన భాజపాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని