భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత చూపు?

పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది.

Updated : 19 Apr 2024 08:56 IST

టికెట్‌ కేటాయించే అవకాశాలు

జన్నారం, న్యూస్‌టుడే: పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీలో ఉండడం... పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండడం ఆ పార్టీకి బలాన్నిచ్చే అంశం. ఆ స్థానాన్ని ఇప్పటికే గోమాసె శ్రీనివాస్‌కు కేటాయించిన భాజపా... కాంగ్రెస్‌ అభ్యర్థికి దీటైన వ్యక్తిని బరిలో నిలపాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్‌షా ఏర్పాటుచేసిన కమిటీలోని సభ్యులు వెంకటేశ్‌ నేత పేరును సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే నామినేషన్‌ వేసేందుకు సిద్ధంగా ఉండాలని  ఆయనకు చెప్పినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన 2019 భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆ పార్టీ టికెట్‌ కేటాయించలేదు. దీనిపై వెంకటేశ్‌నేతను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా భాజపాలో చేరికపై త్వరలో స్పష్టత ఇస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని