కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేసు

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది.

Published : 20 Apr 2024 04:56 IST

ఆదిభట్ల: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా పెదఅడిశర్లపల్లికి చెందిన రాధికకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో సర్వే నెంబర్‌ 500, 501లతో 200 గజాల స్థలం ఉంది. దీనిని చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కబ్జా చేశారని ఆరోపిస్తూ సదరు మహిళ ఇబ్రహీంపట్నం 15వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13న కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని