ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా గీతాల ఆవిష్కరణ

సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్‌ వారియర్స్‌, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు.

Updated : 20 Apr 2024 05:48 IST

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్‌ వారియర్స్‌, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఒకటే మాట.. ఒకటే బాట.. చంద్రబాబుకే ఓటేద్దాం మనమంతా, (ఇదే పల్లవితో మరో రెండు పాటలు), చంద్రబాబు నాయుడు.. సంక్షేమం, అభివృద్ధికి ఆద్యుడు.. పేరుతో గీతాలు రూపొందించారు. ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించనున్నట్లు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, సినీ నిర్మాత కేఎస్‌ రామారావు, కొడాలి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని