ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 05:03 IST

దిల్లీ: భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనకు ఈ విషయమై చక్కని ఫీడ్‌బ్యాక్‌ అందుతోందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తొలి దశ పోలింగ్‌ ముగిసిన అనంతరం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘తొలిదశలో అద్భుతమైన స్పందన లభించింది.  దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్డీయేకు భారీ సంఖ్యలో ఓటు వేశారన్నది సుస్పష్టం’’ అని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని