ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ పౌరులకు సూచించారు.

Published : 20 Apr 2024 05:04 IST

సీఈసీ రాజీవ్‌కుమార్‌ పిలుపు

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ పౌరులకు సూచించారు. అందులో వేసిన ఓట్లు భద్రంగా, సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈవీఎంలన్నీ 100 శాతం సురక్షితమైనవని, వాటికి సాంకేతికంగా, పాలనాపరంగా పలు రకాల రక్షణ వ్యవస్థలున్నాయని వివరించారు. ఇదే విషయం న్యాయస్థానానికి వివరించామని, తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈవీఎంలకు ఏమీ జరగదని, అన్ని దశల్లో రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థులు వాటిని పరిశీలించారని, నమూనా పోలింగ్‌లు కూడా నిర్వహించామని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని