అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలి

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Updated : 20 Apr 2024 06:48 IST

సీఈఓకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ‘పవన్‌ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎన్నికల్లో సానుభూతితో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన జగన్‌పై చర్యలు తీసుకోవాలి’ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని