రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్‌ నాటకం: వర్ల రామయ్య

సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Published : 20 Apr 2024 05:37 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సాక్షి పత్రిక కల్పిత కథనాలకు పోలీసులు ఆజ్యం పోసి దీన్నో సంచలనాత్మక కేసుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న కేసుల్లో కూడా నిందితుల్ని మీడియా ముందుకు తీసుకొచ్చే పోలీసులు...ఈ కేసు విషయంలో కేవలం నోట్‌ ఇచ్చి ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కావాలనే వడ్డెర బిడ్డల్ని ఈ కేసులో ఇరికిస్తున్నారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎంను ఎవరైనా గులకరాయితో చంపాలని చూస్తారా? విజయవాడ సీపీ కాంతిరాణాకు ఈ మాత్రం తెలియదా? అసలు ఈ కేసు విచారణే తప్పుల తడకగా ఉంది’’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని