సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్‌ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published : 20 Apr 2024 05:39 IST

ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్‌ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కన్నుమిన్ను కానరాక ప్రచారరథాన్ని నడిపిన నిర్లక్ష్యం బాలుడి మృతికి ఒక కారణమైతే...అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌ అందించలేని వైకాపా పాలనా నిర్లక్ష్యం మరో కారణమని ‘ఎక్స్‌’ వేదికగా శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి 108 రాకపోవడంతోనే బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భరద్వాజ్‌ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని