హెచ్‌సీయూలో ఏబీవీపీ దాడులపై విచారణ జరపాలి: తమ్మినేని

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 22 Apr 2024 04:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఏడుగురు విద్యార్థినులతో పాటు 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓ పథకం ప్రకారం సున్నితమైన అంశాల్ని ముందుకు తెచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని, బాధితులపై పెట్టిన బైండోవర్‌ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని