ఆర్జేడీలో చేరిన బిహార్‌లోని ఎన్డీయే ఏకైక ముస్లిం ఎంపీ

బిహార్‌కు చెందిన ఎల్‌జేపీ లోక్‌సభ సభ్యుడు మహబూబ్‌ అలీ కైసర్‌ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్‌ అలీ కావడం గమనార్హం.

Published : 22 Apr 2024 04:32 IST

పట్నా: బిహార్‌కు చెందిన ఎల్‌జేపీ లోక్‌సభ సభ్యుడు మహబూబ్‌ అలీ కైసర్‌ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్‌ అలీ కావడం గమనార్హం. లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ సమక్షంలో కైసర్‌ ఆర్జేడీలో చేరారు. ‘‘పార్టీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌తో భేటీ అనంతరం కైసర్‌ ఆర్జేడీలో చేరారు. ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది’’ అని తేజస్వీ పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి పశుపతికుమార్‌ పారస్‌ ఎల్జేపీని చీల్చినప్పుడు కైసర్‌ ఆయన వెంట నడిచారు. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో చిరాగ్‌ పాస్వాన్‌ టికెట్‌ ఇవ్వలేదు. ఆయనతో సయోధ్యకు కైసర్‌ విఫలయత్నం చేశారు కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని