రేపు నామినేషన్‌ వేయనున్న పవన్‌కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 22 Apr 2024 07:11 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. పిఠాపురం మండలంలోని కుమారపురంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్లి పవన్‌ నామినేషన్‌ వేస్తారన్నారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని