ఉద్యోగులను చూసి వణికిపోతున్న జగన్‌

ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు ఆరోపించారు.

Published : 22 Apr 2024 05:07 IST

పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు తగ్గించే కుట్ర: ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు ఆరోపించారు. సీఎం జగన్‌ పాలనపై అసహనంతో ఉన్న ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనే భయంతో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఉద్యోగులను చూసి జగన్‌ వణికిపోతున్నారు. ఆయన కోసం పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు నమోదు కాకుండా చేసేందుకు ఫాం-12పై ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్‌ అందకుండా అయోమయానికి గురిచేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంతవరకూ నోడల్‌ అధికారులను నియమించలేదు’ అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని