శ్రీశైలం క్షేత్ర పరిధిలో.. ఎన్నికల ప్రచారంపై అధికారుల అభ్యంతరం

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Published : 22 Apr 2024 05:10 IST

ఆర్వో అనుమతిచ్చారని ఎమ్మెల్యే శిల్పా వాగ్వాదం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. క్షేత్ర పరిధిలోని మహిషాసుర మర్దిని ఆలయంలో పూజల అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా కార్తిక్‌రెడ్డి, వైకాపా రాష్ట్ర నాయకుడు బుడ్డా శేషిరెడ్డి ప్రచారానికి బయల్దేరారు. శ్రీగిరికాలనీ, ఎస్సీ కాలనీల్లో ఓట్లు అభ్యర్థించారు. ఎస్సీ కాలనీ వద్దకు చేరుకోగానే తహసీల్దారు గుర్రప్ప, ఒకటో పట్టణ ఎస్సై లక్ష్మణరావు, దేవస్థానం సీఎస్‌వో అయ్యన్న తమ సిబ్బందితో వచ్చి వారి ప్రచారాన్ని అడ్డుకున్నారు. దేవాదాయ చట్టం నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీ గుర్తులు, అభ్యర్థుల ఫొటోలతో ప్రచారం చేయకూడదని వివరించారు. ఎన్నికల ప్రచారం కోసం రిటర్నింగ్‌ అధికారి తమకు అనుమతిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. దేవాదాయశాఖ నిబంధనల గురించి తనకు లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. లేనిపక్షంలో కేసు నమోదు చేసుకోవాలని, ప్రచారాన్ని మాత్రం అడ్డుకోవద్దని వారితో వాగ్వాదానికి దిగారు. చివరికి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రచారం కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని