పార్టీ నిర్ణయం శిరోధార్యం: దేవినేని ఉమా

పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated : 22 Apr 2024 07:49 IST

గొల్లపూడి, న్యూస్‌టుడే: పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడిలోని ఉమామహేశ్వరరావు కార్యాలయానికి తెదేపా మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ ఆదివారం రాత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాము అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. రాక్షసరాజ్యాన్ని కూల్చేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. తంగిరాల సౌమ్య, కృష్ణప్రసాద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ తమ మధ్య వ్యక్తిగత వైరం లేదన్నారు. తన నామినేషన్‌ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావును ఆహ్వానించేందుకు వచ్చినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని