బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?

‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి ప్రశ్నించారు.

Published : 23 Apr 2024 06:27 IST

కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి మండిపాటు

ప్యాపిలి (గుడిపాడు), న్యూస్‌టుడే: ‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం గుడిపాడు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనకు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు విన్నవించారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తెదేపా అధికారంలోకి రాగానే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తామని కోట్ల హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకొంటున్నారే గానీ నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు