మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్‌ ప్రగల్భాలు పలకడం విడ్డూరం

వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్‌ ఐ-ప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 18 May 2024 05:33 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

మాట్లాడుతున్న బొండా ఉమామహేశ్వరరావు. చిత్రంలో పార్టీ నాయకులు లొడగల కృష్ణ, పొలమరశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్‌ ఐ-ప్యాక్‌ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2019 ఫలితాలకు మించి వైకాపా విజయం సాధించబోతోందంటూ జగన్‌ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఓడిపోతున్నామన్న విషయాన్ని జీర్ణించుకోలేక.. తామే గెలుస్తామంటూ చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న జగన్‌.. ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అప్‌లోడ్‌ పేరుతో ప్రభుత్వ ఈ-ఫైల్స్‌ను ధ్వంసం చేస్తుండటంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఏ రకంగా నష్టపోయారో చూసైనా మిగిలిన జిల్లాల అధికారులు కళ్లు తెరవాలి. విశాఖలో రాజధాని పేరుతో స్థిరాస్తి వ్యాపారాలు చేసుకున్న వైకాపా అభ్యర్థులను ప్రజలు ఎందుకు గెలిపిస్తారు..? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని