వైకాపా ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌ తెలిపారు.

Published : 18 May 2024 03:56 IST

అదనపు ఎస్పీకి ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌ ఫిర్యాదు

నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు అందజేస్తున్న గొట్టిముక్కల సుధాకర్‌

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ (వైకాపా) అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అదే పట్టణానికి చెందిన ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌ తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలని గుంటూరులో నేరవిభాగ జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ కేంద్రం వద్ద ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్‌ శుక్రవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ తుషార్‌ను కలవడానికి ప్రయత్నించగా.. తాను ఓట్ల లెక్కింపు బందోబస్తులో తీరికలేకుండా ఉన్నానని, నేరవిభాగ జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావును కలవాలని సూచించారు. దీంతో సుధాకర్‌.. అదనపు ఎస్పీని కలసి.. ఎమ్మెల్యే అనుచరులు గత కొద్ది రోజులుగా తెనాలిలోని తన ఇంటితోపాటు తల్లి లీలావతి, సోదరి రాణీలత ఇళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారని తెలిపారు. రక్షణ కల్పించాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని