ఎన్నికల ప్రక్రియలో సీఎస్‌ జోక్యంతోనే హింసాకాండ

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జోక్యం వల్లే పోలింగ్‌ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

Published : 18 May 2024 03:58 IST

తెదేపా మాజీ ఎంపీ కనకమేడల 

ఈనాడు, దిల్లీ: ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జోక్యం వల్లే పోలింగ్‌ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో హింసకు ఏయే అధికారి కారణమో తెలిసీ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాజంపేటకు చెందిన డీఎస్పీ చైతన్య తాడిపత్రికి వచ్చి తెదేపా నాయకులు, సానుభూతిపరులపై దాడి చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశానికి ఓటేశారన్న అక్కసుతో ఉత్తరాంధ్రలోనూ వైకాపా మూకలు దాడులకు తెగబడుతున్నాయి. పల్నాడు జిల్లాలో మారణాయుధాలతో అధికార వైకాపా గూండాలు నడిరోడ్డుపై పరేడ్‌ చేస్తూ దాడులకు తెగబడుతున్నారని అధికారులకు సమాచారమందినా స్పందించలేదు. దీన్నిబట్టి ప్రభుత్వమే హింసను ప్రోత్సహించినట్లు స్పష్టమవుతోంది. రాయలసీమతోపాటు పల్నాడు ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. కేంద్ర బలగాలను పెంచాలి’ అని కనకమేడల డిమాండ్‌ చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని