నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ

సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్‌కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది.

Updated : 18 May 2024 06:17 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్‌కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంమీద 8.97 కోట్ల మంది పురుషుల్లో 69.58% మంది, 8.73 కోట్ల మంది మహిళల్లో 68.73% మంది ఈ నెల 13న తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని శుక్రవారం వెల్లడించింది. తొమ్మిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ జరిగితే వాటిలో బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారని తెలిపింది. ఓట్ల లెక్కింపు తర్వాతే కచ్చితమైన పోలింగ్‌ శాతం తెలుస్తుందని, ఆరోజు పోస్టల్‌ బ్యాలెట్లను కూడా లెక్కించి జత చేస్తామని ఈసీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని